హైదరాబాద్, ఆగస్టు 28( నమస్తే తెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదల కారణంగా 13 జిల్లాల్లోని విద్యాసంస్థలు బంద్ చేశారు. కామారెడ్డి, మెదక్, నిర్మల్, కుమ్రం భీం ఆసిఫాబాద్, నల్గొండ, ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, ఖమ్మం, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలకు గురువారం సెలవు ఇచ్చారు.
మెదక్ జిల్లాలో శుక్రవారం, కామారెడ్డి జిల్లాలో శుక్ర, శనివారాలు కూడా సెలవు ప్రకటించారు.