నాగర్‌కర్నూల్, జూలై 29 : నాగర్‌కర్నూ ల్ జిల్లా ఉయ్యాలవాడ సమీపంలోని మహాత్మాజ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలలో జరిగిన ఫుడ్‌పాయిజన్ ఘటనతో స్కూల్ ఆవరణ నిర్మానుష్యంగా మారింది. ఫుడ్‌పాయిజన్ ఘటన భయం ఇంకా విద్యార్థులు, తల్లిదండ్రుల్లో వీడలేదు. మంగళవారం సైతం మ రింత మంది విద్యార్థులు ఇంటిబాట పట్టారు. 6 నుంచి 12వ తరగతి వరకు ఏడు తరగతులకుగానూ 743 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తుండగా.. ప్రస్తుతం 270 మంది మాత్రమే ఉన్నట్లు పాఠశాల నిర్వాహకులు తె లిపారు. విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి అంతా నిలకడగా ఉండడంతో పాఠశాలలో ఏర్పాటు చేసిన హెల్త్‌క్యాంపును తొలగించారు. అస్వస్థతకు గురైన విద్యార్థినుల ఆరోగ్యం కుదుట పడినప్పటికీ, చాలామందిలో భయం మాత్రం వీడలేదు. విషయం తెలుసుకునేందుకు విద్యార్థినుల తల్లిదండ్రులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాల నాయకులు పాఠశాలకు వస్తున్నారు. దీంతో స్కూల్ గేటుకు నో ఎంట్రీ బోర్డును పెట్టారు. లోపలికి అనుమతి లేదంటూ కలెక్టర్ పేరుతో ఉన్న బోర్డును ఏర్పాటు చేశారు.