హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో మిగులు టీచర్ల సర్దుబాటుకు పాఠశాల విద్యాశాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రక్రియను చేపట్టే అధికారాన్ని కలెక్టర్లకు అప్పగించింది.
జిల్లాలో విద్యార్థుల సంఖ్యను బట్టి పాఠశాలలు, సబ్జెక్టులవారీగా అవసరాలను క్షుణ్ణంగా పరిశీలించి సర్దుబాటు చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ సూచించారు. జూన్ 20నాటి విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌ను ప్రాతిపదికగా తీసుకుని, జీవో-25ను అనుసరించి సర్దుబాటు చేపట్టాలని స్పష్టంచేశారు.