హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తేతెలంగాణ) ః తెలంగాణ జీవవైవిధ్యానికి నెలవుగా మారింది. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చేపట్టిన హరితహారం, మిషన్ కాకతీయ పథకాలతో తెలంగాణ పర్యావరణం జీవ వైవిధ్యాన్ని సంతరించుకున్నది. దీంతో విదేశీ పక్షులతో పాటు అత్యంత అరుదైన జంతువులు తెలంగాణ అటవీ ప్రాంతాల్లో దర్శనమిస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యంత అరుదైన జంతువులు, పక్షులు కొంత కాలంగా రాష్ట్రంలోని పర్యావరణ ప్రేమికులను ఆకట్టుకుంటున్నాయి. రాష్ట్రంలో మొదటిసారిగా అరుదైన ‘సేలీథ్రష్’ పక్షి మహబూబాబాద్ జిల్లా గూడూరు రిజర్వ్ ఫారెస్ట్‌లోని భీముని పాదం జలపాతం వద్ద కనిపించింది. రెండు రోజుల పర్యటనకు వచ్చిన పక్షి శాస్త్రవేత్త శ్రీరామ్‌రెడ్డి తన కెమెరాలో ఈ అరుదైన పక్షి చిత్రాన్ని బందించారు. హిమాలయాలు, ఈశాన్య రా ష్ట్రాల నుంచి ఇది తెలంగాణకు వలస వచ్చినట్ల్లు చెప్పారు. దీన్ని తెలంగాణలో కనిపించిన 444వ పక్షి జాతిగా పేర్కొన్నారు.
ప్రపంచంలోనే అతి చిన్న అడవి పిల్లిగా పరిగణించబడే తుప్పుపట్టిన మచ్చలపిల్లి మహబూబాబాద్ జిల్లాలో శనివారం ఉద యం కనిపించింది. ఇంటర్నేషనల్ ఐయూసీఎన్చే గుర్తించిన మచ్చలపిల్లి తెలంగాణలో కనిపించింది. హబూబాబాద్ జిల్లా నరసింహులుపేట మండలం కౌసల్యదేవిపల్లిలో ఈ అరుదైన పిల్లి కనిపించింది.
అబిడ్స్, డిసెంబర్ 3 : దొడ్డి కొమురయ్య కురుమల ఆత్మగౌరవ భవనాన్ని ఈ నెల 14న ప్రారంభించనున్నట్టు కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం తెలిపారు. ముస్లింజంగ్ వంతెన వద్ద ఉన్న కురుమ సంఘం రాష్ట్ర కార్యాలయంలో సం ఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, బీఆర్ఎస్ నేత క్యామ మల్లేశ్, సంఘం ప్రతినిధులతో కలిసి ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. అదే రోజు భవన్లో కురుమల 45వ దసరా, దీపావళి సమ్మేళనం నిర్వహించనున్నట్టు చెప్పారు. కోకాపేట ఫేజ్-3 సీబీఐటీ ఇంజినీరింగ్ కళాశాల రోడ్డులో కట్టిన భవనం ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్‌రెడ్డి, కర్ణాటక సీఎం సిద్దరామయ్య కురుమ, హర్యానా గవర్నర్ బండా రు దత్తాత్రేయ కురుమ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కురుమ, కర్ణాటక మాజీ మంత్రి రేవన్న హాజరవుతారని తెలిపారు.