Residential Degree College | హైదరాబాద్ : గురుకుల విద్యార్థినులపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థినుల పట్ల పోలీసులు అరాచకంగా ప్రవర్తించారు. అమ్మాయిలు అని చూడకుండా వారిపై పోలీసులు విరుచుకుపడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
నాగర్కర్నూల్ సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కాలేజీకి చెందిన విద్యార్థినులు.. ప్రిన్సిపల్ శైలజ తమను వేదిస్తుందని, ఆమెను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. షాద్నగర్ బైపాస్ రోడ్డుపై విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. కళాశాలలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రిన్సిపల్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ముందు అక్రమాలు ఆపండి, ఆ తర్వాత విద్యను అందించండి అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.
గురుకుల విద్యార్థినులపై పోలీసుల దౌర్జన్యం
మఫ్టీలో ఉన్న మహిళా కానిస్టేబుల్ పై దాడి చేసిన విద్యార్థినులు.. పరిస్థితి ఉద్రిక్తత
షాద్ నగర్ జాతీయ రహదారిపై ధర్నాకు దిగిన విద్యార్థినులు
ప్రిన్సిపల్ శైలజ తమను వేదిస్తుందని, ఆమెను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగిన… pic.twitter.com/a0G5sEIRJn
— Telugu Scribe (@TeluguScribe) November 2, 2025