హైదరాబాద్, జూలై17 (నమస్తే తెలంగాణ): విద్యార్థుల ఆత్మహత్యలను రాజకీయం చేయొద్దని ఎస్సీ గురుకుల సొసైటీ సెక్రటరీ అలగు వర్షిణి కోరారు. ఆత్మహత్యలు ఒక్క తెలంగాణలోనే లేవని, దేశమంతా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. సూసైడ్ టెండెన్సీ జాతీయంగా, అంతర్జాతీయంగా పెరుగుతున్నదని తెలిపారు.
ఎన్సీఆర్బీ రికార్డుల ప్రకారం దేశంలో 13వేల మందికి పైగా బలవన్మరణాలకు పాల్పడుతున్నారని, ఇవి ఒక పార్టీతోనో, ఒక నాయకుడితోనో జరగడం లేదని వెల్లడించారు. గురుకులాల్లో ఆత్మహత్యల నివారణకు ఫోన్మిత్ర తదితర కార్యక్రమాలు అమలుచేస్తున్నట్టు తెలిపారు.