అబిడ్స్, మార్చి 1 : అమరవీరుల త్యాగాల వల్లే ఎస్సీ వర్గీకరణ సాధ్యమయ్యిందని, అమరుల కుటుంబాలను పరామర్శించడానికి త్వరలో రాష్ట్రవ్యాప్త యాత్ర చేపట్టనున్నట్టు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. మాదిగ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఎంజే మార్కెట్లో పొన్నాల సురేందర్ మాదిగ, దామోదర్ మాదిగ, మహేశ్ మాదిగ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. వంగపల్లి మాట్లాడుతూ… ఎందరో ఉద్యమకారుల ప్రాణత్యాగాలతోపాటు పలువురు జైలుకు వెళ్లడం, లాఠీ దెబ్బలు తినడం వల్లనే ముప్ఫై ఏండ్ల దండోరా ఉద్యమం విజయవంతమైందని పేర్కొన్నారు.