హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): ఫూలే దంపతులకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇచ్చి సముచితంగా గౌరవించుకోవాలని శాసనమండలిలో బీఆర్ఎస్ పక్షనేత మధుసూదనాచారి విజ్ఞప్తిచేశారు. సంఘ సంసర్త సావిత్రీబాయి ఫూలే 194వ జయంతి సందర్భంగా శుక్రవారం తెలంగాణభవన్‌లో ఆ మహనీయురాలి చిత్రపటాని కి పార్టీ నేతలతో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు నివాళుల ర్పించారు. సావిత్రీబాయి సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడుతూ.. వారి ఆశయాలను సా ధించడమే నిజమైన నివాళి అని పేర్కొన్నా రు. దేశం అన్ని రంగాల్లో బాగుపడాలంటే చదువు ముఖ్యమైన ఆయుధమని భావించి మహిళా విద్య కోసం సావిత్రీబాయి ఎంతో కృషి చేశారని గుర్తుచేశారు. ఫూలే దంపతుల స్ఫూర్తితో రాష్ట్రంలో వందలాది గురుకులాలను కేసీఆర్ స్థాపించారని చెప్పారు. రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా బాలికల విద్యాభివృద్ధికి ఎనలేని కృ షి చేశారని గుర్తుచేశారు.
మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ దేశంలో అట్టడుగువర్గాలకు విద్యావకాశాలకు నాంది పలికింది ఫూలే దంపతులేనని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకురాలు తుల ఉమ మాట్లాడుతూ రాజకీయాల్లో, వ్యాపారాల్లో రాణిస్తున్నామంటే సావిత్రీబాయి స్ఫూర్తే కారణమని పేర్కొన్నారు. బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ మాట్లాడుతూ బీసీలకు విద్యనందించడంలో సావిత్రీబాయి పాత్ర ఎనలేనిదని ప్రశంసించారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎంపీలు బడుగుల లింగయ్యయాదవ్, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, పద్మాదేవేందర్‌రెడ్డి, పట్లోళ్ల శశిధర్‌రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, బీఆర్ఎస్ నాయకులు గట్టు రామచంద్రరావు, పల్లె రవి, గెల్లు శ్రీనివాస్‌యాదవ్, చిరుమళ్ల రాకేశ్, సతీశ్‌రెడ్డి, మన్నె గోవర్ధన్‌రెడ్డి, బొమ్మెర రామ్మూర్తి, ఉపేంద్ర, గోపగాని రఘురామ్, కిశోర్‌గౌడ్, తుంగబా లు, గాంధీనాయక్, అరుణ, సుశీలారెడ్డి, అర్పితాప్రకాశ్, రుద్ర రాధ, రేఖ శామిలేటి తదితరులు పాల్గొన్నారు.