హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ): స్త్రీ విద్య కోసం సావిత్రీబాయి పూలే విశేష కృషి చేశారని రా ష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కొనియాడారు. సావిత్రీబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించడంపై హర్షం వ్యక్తంచేశారు. ఈ మేరకు మంత్రి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.
హైదరాబాద్, జనవరి 2 (నమస్తేతెలంగాణ) : జనవరి 3న సావిత్రీబాయి పూలే జయంతిని మ హిళా ఉపాధ్యాయ దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం ప్ర కటించింది. రాష్ట్రమంతటా ఈ దినోత్సవాన్ని నిర్వహించాలని సీఎస్ శాం తికుమారి గురువారం జీవో-9 జారీచేశారు. ఇకపై యేటా జనవరి 3న మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహిస్తారు.