మహబూబాబాద్ రూరల్, ఆగస్టు 25: రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్సింగ్ను కలిసి సోమవారం వినతి పత్రాన్ని అందజేశారు.
వారం రోజుల నుంచి రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారని, వెంటనే జిల్లాకు సరిపడా యూరియా నిల్వలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గత పదేండ్లలో ఇలాంటి సమస్యలు తలెత్తలేదని పేర్కొన్నారు. గత ప్రభుత్వం పోడు రైతులకు 75 వేల ఎకరాలకు పట్టాలిచ్చిందని, వాటికి కూడా యూరియా సరఫరా చేయాలని కోరారు.