Satyavathi Rathod | జయశంకర్ భూపాలపల్లి : భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రధాన ఆస్పత్రిని మంత్రి సత్యవతి రాథోడ్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా కొత్తగా ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్‌ను మంత్రి పరిశీలించారు.
నూతనంగా ఏర్పాటుచేసిన ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్, పోస్ట్ ఆపరేటివ్ వార్డులను మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం హాస్పిటల్లో కొత్త అంబులెన్సులను ప్రారంభించారు. తెలంగాణలో కార్పొరేట్ హాస్పిటల్స్‌కు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యం అందుతుందని మంత్రి అన్నారు. అనంతరం అక్కడి నుండి నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటైన గోరుకొత్తపల్లి మండలంలో పర్యటించి తహసిల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అంగన్వాడీ సెంటర్లకు గుడ్లు, ఫర్నిచర్‌ను పంపిణీ చేశారు.
Satyavathi Bhupalalyy1