హైదరాబాద్, సెప్టెంబర్30 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకం కింద ఖమ్మం జిల్లాలోని సుమారు 25 వేల నుంచి 30 వేల దళిత కుటుంబాలకు లబ్ధి చేకూరనున్నది.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో, అదే జిల్లా మధిర నియోజకవర్గం బోనకల్ మండలంలోని నూరుశాతం దళిత కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింపజేయనున్నది.