హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ హయాంలోనే ప్రభుత్వ పాఠశాల ల్లో సోలార్ విద్యుత్ ఏ ర్పాటుచేసినట్టు రెడ్కో మాజీ చైర్మన్, బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి స్పష్టంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అబద్ధాలు మాట్లాడటమే విధానంగా మారిందని పేర్కొన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం 1521సూళ్లలో 33 కోట్లతో సోలార్ విద్యు త్ ప్లాంట్లు ఏర్పాటుచేసిందని, ఆ పనులు పూర్తయ్యాయని వివరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెచ్చిన పథకాన్ని తమ పథకంగా ప్రచార చేసుకోవడం కాంగ్రె స్ ప్రభుత్వ భావదారిద్య్రానికి నిదర్శనమని విమర్శించారు.