సత్తుపల్లి టౌన్, మే 7: సత్తుపల్లి నియోజకవర్గ కాంగ్రెస్‌లో వర్గాల లొల్లి మొదలైంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ను వీడిన నేతలు.. ఆ పార్టీ అధికారంలోకి వచ్చా క మళ్లీ చేరారు. దీంతో వర్గపోరు బహిర్గతమైంది. కొత్తగా పార్టీలో చేరిన వారికి, సత్తుపల్లి ఎమ్మెల్యే దయానంద్ వర్గీయులకు సఖ్య త కుదరడంలేదు.
జగ్గారెడ్డి సమక్షంలో మాజీ మంత్రి చంద్రశేఖర్ ఇటీవల తన వర్గీయులతో కాంగ్రెస్‌లో చేరారు. కాకర్లపల్లిలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశానికి చంద్రశేఖర్‌ను రానీయకుండా ఎమ్మెల్యే వర్గీయులు నిరసనకు దిగారు. రోడ్డుపై ధర్నా చేపట్టి ‘సంభాని.. గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు.