కామారెడ్డి : జిల్లాలోని మాచారెడ్డి ( Machareddy ) పోలీస్ స్టేషన్ పరిధిలోని పల్వంచ మండల కేంద్రంలో ఫరీద్‌పేట్, బండారం ఈశ్వర్పల్లి, భవానిపేట్, వాడి గ్రామాలలో 600కు పైగా వీధి కుక్కలను ( Dogs ) చంపేశారని ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఈ ఘటన పట్ల జంతు ప్రేమికులు, హక్కుల కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సంబంధిత గ్రామాలలో కొత్తగా ఎన్నికైన సర్పంచుల పర్యవేక్షణలో ఈ సామూహిక హత్య జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన జరిగిన తర్వాత, జంతు హక్కుల కార్యకర్తలు మూల రజని, అనపోలు అనిత, భాను ప్రకాష్, గోవర్ధన్, తదితరులు మాచారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
దర్యాప్తులో భాగంగా, కుక్కలను పూడ్చిపెట్టారని ఆరోపణలు వచ్చిన ప్రదేశాలను గుర్తించి, పంచనామా నిర్వహించారు. ఈ ఘటనపై జంతు సంక్షేమ సంఘాలు మాట్లాడుతూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని , జంతు సంరక్షణ చట్టాలను కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.