హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు తక్షణమే బిల్లులు చెల్లించాలని సర్పంచుల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ ప్రభుత్వానికి విన్నవించారు. గురువారం హైదరాబాద్ పీఆర్డీ కార్యాలయంలో పీఆర్ డిప్యూటీ కమిషనర్ సుధాకర్‌కు వినతిపత్రం అందజేశారు.
బిల్లులు విడుదలకాకపోవడంతో చాలామంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని గుర్తుచేశారు. కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, మల్లయ్య, ప్రధాన కార్యదర్శి నాగయ్య, నాయకులు సముద్రాల రమేశ్, నడికుడ రవీందర్రావు, వెంకట్రామిరెడ్డి, పాండురంగారెడ్డి, బస్మాపురం స్వప్న, అంజయ్యగౌడ్ పాల్గొన్నారు.