జయశంకర్ భూపాలపల్లి, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ సర్పం చ్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న వానరాసి మౌనికాఅజయ్ వినూత్న ప్రచారంతో ఆకట్టుకుంటున్నారు. తనను సర్పంచ్‌గా గెలిపిస్తే ఆడబిడ్డల పెండ్లికి 5,116, ఆడబిడ్డ పుడితే 2,116, ఎవరైనా చనిపోతే రూ.5వేల ఆర్థికసాయం, ఏటా నిరుపేద విద్యార్థులు ఐదుగురిని గుర్తించి ఒక్కొక్కరికి రూ.2 వేల చొప్పున తన సొంత ఖర్చులతో ఆర్థిక సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు.