పెండింగ్ బిల్లులను 31 డిసెంబర్ 2024లోపు ఇప్పించాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ను తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం జేఏసీ విజ్ఞప్తి చేసింది. మినిస్టర్ క్యాంప్ ఆఫీసులో మంత్రి పొన్నం ప్రభాకర్‌ను జేఏసీ నేతలు శనివారం కలిశారు. తమ సమస్యలపై సీఎం స్పందించి, తమను చర్చలకు పిలవాలని కోరారు. డిసెంబర్ 31వ తేదీలోపు బిల్లులను క్లియర్ చేయాలని విజ్ఞప్తి చేశారు.
తమ సమస్యలపై స్పందించకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12,769 గ్రామాల సర్పంచ్‌లు మొత్తం కుటుంబాలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని సర్పంచుల జేఏసీ అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ తెలిపారు.