హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కుకకాట్లకు చిన్నారులు బలవుతున్నా కాంగ్రెస్ సర్కారుకు చీమకుట్టినట్టు కూడా లేకపోవటం దుర్మార్గమని మాజీమంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. కుకలు పీకుతినడం, కుకకాటుకు మరణాలు అనే వార్తలు రాష్ట్రంలో సాధారణంగా మారిపోయాయని, కుక కాట్లు పెరిగిపోతున్నాయని ముందే ప్రభుత్వాన్ని హెచ్చరించినా పట్టించుకోలేదని ఎక్స్ వేదికగా సర్కారు తీరును ఎండగట్టారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఈ ఏడాది రాష్ట్రంలో 60వేలకు పైగా కుక కాట్లు నమోదయ్యాయని, పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారని, ఎన్నో కుటుంబాల్లో విషాదం నిండిందని తెలిపారు. నియంత్రణ పకనపెడితే, ప్రభుత్వ దవాఖానల్లో కనీసం యాంటిరేబిస్ ఇంజక్షన్లనూ అందుబాటులో ఉంచలేదని మండిపడ్డారు. గ్రామాల్లో, పట్టణాల్లో పారిశుధ్య నిర్వహణ పడకేసిందని, చెత్తాచెదారం పేరుకుపోయి వీధికుకల బెడద విపరీతంగా పెరిగిపోయిందని అన్నారు. పురపాలకశాఖ వైఫల్యం వల్ల వీధి కుకల నియంత్రణ లేక మనుషుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయని,
రాష్ట్రంలో 20 లక్షలకు పైగా వీధికుక లు ఉంటే అందులో 10 లక్షలకు పైగా కుక లు జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయంటే ప్రభుత్వ యంత్రాంగ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కుక్కల సంతాన నియంత్రణ ఆపరేషన్లకు (స్టెరిలైజేషన్) ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవటం శోచనీయమని తెలిపారు. కుకకాటు మరణాలపై హైకోర్టు మందలించినా రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రవీడటం లేదని, ఇప్పటికీ కుక్క కాట్ల నివారణకు ఎలాంటి కార్యాచరణ ప్రకటించలేదని ధ్వజమెత్తారు. గత మూడేండ్లుగా ఒక కుక కాటు మరణం సంభవించని గోవా లాంటి రాష్ట్రాల నియంత్రణ పద్ధతులను అధ్యయనం చేయాలని సూచించారు. హర్యానా, పంజాబ్ హైకోర్టుల తీర్పును దృష్టిలో పెట్టుకొని కుక కాటుతో మరణించినవారికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ.50వేలు అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర హైకోర్టు సూచన మేరకు వీధి కుకల నియంత్రణకు కమిటీలు ఏర్పాటు చేయాలని, క్రమం తప్పకుండా స్టెరిలైజేషన్ చేయాలని హరీశ్‌రావు పేర్కొన్నారు.