DSC Results | హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): డీఎస్సీ ఫలితాల వెల్లడిపై సర్కారు ఆచీతూచీ అడుగులేస్తుంది. ముఖ్యంగా తప్పు ల భయం ప్రభుత్వాన్ని పట్టి పీడిస్తుంది. ఇప్పటికే ఎస్జీటీ పరీక్షల్లో ఏకంగా 18-19 ప్రశ్నలు పునరావృతం కాగా, ఈ అంశంలో సర్కారు అబాసుపాలైంది. దీంతో పైనల్ కీని ఒకటికి రెండుసార్లు పరిశీలిస్తున్నారు. ఫైనల్ కీ, ఫలితాలు విడుదల విషయంలో ఏ చిన్న పొరపాటు జరగకుండా అధికారులు ఎకువ జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు ఓ ఉన్నతాధికారి తెలిపారు.
కాగా, తుది కీ ని పాఠశాల విద్యాశాఖ మంగళవారం రాత్రి లేదా బుధవారం విడుదల చేసే అవకాశాలున్నాయి. ఈ నెల రెండో వారంలో ఫలితాలు ప్రకటించనున్నారు. 28 వేలకుపైగా అభ్యంతరాలు రావడంతో మార్కులేమైనా కలుస్తాయా.. అన్న ఆతృత అభ్యర్థుల్లో కనిపిస్తుంది. ఫైనల్ కీ తర్వాత డీఎస్సీ మారులు, టెట్ మారులను కలిపి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్(జీఆర్ఎల్)ను విడుదల చేయనున్నారు. ఆ తర్వాత 1:3 మెరిట్ జాబితాను విడుదల చేసి అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపడతారు.