హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తేతెలంగాణ) : గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మాజీ మంత్రి జోగు రామన్న పిచ్చిమొక్కల స్థానంలో పచ్చని అడవిని రూపొందించడం నిజంగా స్ఫూర్తిదాయకమని గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ అభినందించారు. ‘పరివర్తనకు సాక్షి! మాజీ మంత్రి నేతృత్వంలోని ప్లాంటేషన్ చొరవకు ముందు, ఆ తర్వాత అద్భుతాన్ని చూడండి. పిచ్చిమొక్కలతో ఉన్న ప్రాంతంలో మొక్కలు నాటి పచ్చని అడవిని రూపొందించారు. నిజంగా స్ఫూర్తిదాయకం.. పచ్చని భవిష్యత్తు కోసం జోగురామన్న అంకితభావం, ధృక్పథానికి వందనాలు..’ అంటూ ఎక్స్‌లో మాజీ ఎంపీ సంతోష్‌కుమార్ జోగు రామన్నను అభినందించారు.