Sankranti Holidays | హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ) : సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ నెల 13 నుంచి 17 వరకు పాఠశాలలకు విద్యాశాఖ సెలవులిచ్చింది. ఈ నెల 11 రెండో శనివారం, 12న ఆదివారం కావడంతో అదనంగా రెండు రోజులు సెలవులొచ్చాయి. దీంతో 7 రోజులు సెలవులు ఇచ్చినైట్లెంది.
క్రిస్మస్, బాక్సింగ్‌డే, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ మరణంతో డిసెంబర్ చివరలో వరుసగా మూడురోజులు సెలవులొచ్చాయి. విద్యార్థులు సెలవుల నుంచి తేరుకునే లోపే మళ్లీ సంక్రాంతి సెలవులొచ్చేస్తున్నాయి. ఈ నెల 18(శనివారం) నుంచి పాఠశాలలు తిరిగి తెరుచుకుంటాయి. 19న ఆదివారం కావడంతో మళ్లీ సెలవు.