హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు ఢిల్లీలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన తెలంగాణ క్యాడర్‌కు చెందిన 1992-బ్యాచ్ ఐఏఎస్ అధికారి.
ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత మాజీ కార్యదర్శి అపూర్వ చంద్ర, మంత్రిత్వ శాఖ, వివిధ మీడియా విభాగాల ఇతర అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. అంతకుముందు అంటే 2018 నుంచి 2023 వరకు జాజు భారత ప్రభుత్వ అదనపు కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. జాతీ య రహదారుల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ డైరెక్టర్‌గా 2014 నుంచి 2018 వరకు ఆయన పనిచేశారు.