కోడేరు, జూన్ 23 : పెండింగ్లో ఉన్న జీతాలు వెంటనే చెల్లించాలని పారిశుధ్య కార్మికులు డిమాండ్ చేశారు. నాగర్కర్నూల్ జిల్లా కోడేరు మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మంగళవారం కార్మికులు విధులు బహిష్కరించి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
కోడేరు గ్రామపంచాయతీలో పారిశుధ్య విధులు నిర్వర్తిస్తున్న తమకు మార్చి, ఏప్రిల్ వేతనాలు మంజూరు కాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయానికి చేరుకొని ఎంపీడీవోకు వినతిపత్రం సమర్పించారు.