వలిగొండ, నవంబర్ 10: సంగెం భీమలింగేశ్వర స్వామి సాక్షిగా హింసను ప్రేరేపించే విధంగా సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుపై అనుచిత వ్యాఖ్యలు చేసి భీమలింగేశ్వర స్వామి త్రివేణి సంగమాన్ని అపవిత్రం చేశారని, వారికి సద్బుద్ధిని ప్రసాదించాలని స్వామి వారిని వేడుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం గ్రామ భీమలింగేశ్వర స్వామి వద్ద ఆదివారం బీఆర్ఎస్ నాయకులు శుద్ధి కార్యక్రమాలు, పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మూసీ ప్రక్షాళన పాదయాత్ర సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి ముక్కలు ముక్కలుగా నరికి చంపుతామని, బుల్డోజర్లతో తొక్కిస్తామని, దొంగలు, దోపిదీదారులని అనుచిత వ్యాఖలు చేసి, రాష్ట్రంలో హింసను ప్రేరేపించే విధంగా తులనాడారని, వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వలిగొండ మండలాధ్యక్షుడు తుమ్మల వెంకట్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ మొగుళ్ల శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ సుర్కంటి వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.