MLA Jaggareddy | రాబోయే రోజుల్లో తెలంగాణకు కాబోయే సీఎం అని చెప్పుకొనే ఈయన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. మూడుసార్లు ఎమ్మెల్యేగా పని చేసిన ఆయన నియోజకవర్గానికి ఒరగబెట్టిందేం లేదు! తాజా ఎన్నికల ప్రచారంలో అడుగడుగునా పదనిసలే ఎదురవుతున్నాయి. ఓటర్ల కటాక్షం కోసం ఏ గల్లీలో తిరిగినా బీఆర్ఎస్ సంక్షేమ పథకాన్ని పొందిన వాళ్లే ఎదురవుతుండటంతో కంగుతింటున్నారు.
నిన్నటికి నిన్న ప్రచార జోష్‌లో ఉన్న జగ్గన్న తాను ఎక్కడున్నదీ మర్చిపోయారు. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన సంగారెడ్డి వైద్య కళాశాల ముందు తీన్మార్ డ్యాన్స్ ఫోజిచ్చారు. ఆయన రోడ్‌షోకు హాజరైన వాళ్లు ప్రభుత్వం చేసిన ప్రగతి ముందు ప్రత్యర్థి ప్రచారం చూసి విస్తుపోయారు. ‘ఓ జగ్గన్న కాస్త రైట్ టర్నింగిచ్చుకో!’ అని తమలో తాము చర్చించుకున్నారు.