హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): నెల రోజుల్లో సనత్‌నగర్ టిమ్స్ సేవలు అందుబాటులోకి రానున్న ట్టు రోడ్లు, భవనాలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్ వెల్లడించారు. గురువారం వైద్యారోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టి నా జెడ్ చొంగ్తూ, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, అదనపు కలెక్టర్ ముకుందరెడ్డి, ఇంజినీర్లతో కలిసి సనత్‌నగర్ టిమ్స్, ఉస్మానియా దవాఖాన నూ తన భవన నిర్మాణాలను పరిశీలించారు. ఉస్మానియా దవాఖాన నూతన భవన సముదాయాన్ని నిర్ణీత గడువులోగా పూర్తిచేస్తామని వెల్లడించారు. నిర్మాణ సంస్థ ఎంఈఐఎల్ ప్రాజెక్ట్స్ విభాగం అధ్యక్షు డు గోవర్ధన్ రెడ్డి భవనాల నిర్మాణ పనుల పురోగతిని వికాస్‌రాజ్‌తోపాటు కలెక్టర్ వివరించారు.