కాశీబుగ్గ, డిసెంబర్ 12: దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని కోరుతూ సీఎం రేవంత్రెడ్డి, గవర్నర్కు పోస్టుకార్డు ద్వారా లేఖలు రాసినట్టు బీజేపీ రాష్ట్ర నాయకుడు సముద్రాల పరమేశ్వర్ తెలిపారు.
గురువారం ఆయన వరంగల్ నగరంలో మాట్లాడుతూ వరంగల్ జిల్లా గీసుగొండలోని గోశాలకు నిబంధనలకు విరుద్ధంగా గోవులను కేటాయించినట్టు అధికారుల దర్యాప్తులో తేలినందున వెంటనే కొండా సురేఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్, డిసెంబర్12 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ దవాఖానల పర్యవేక్షణకు పోర్టల్ తీసుకురావాలని మంత్రి రాజనర్సింహ అధికారులను ఆదేశించారు.దవాఖానలో, భద్రత, పరికరాల నాణ్యత, మందుల లభ్యతను తెలుసుకునేలా పోర్టల్ ఉండాలని చెప్పారు. అధికారులతో గురువారం రాజనర్సింహ సమీక్షించారు. దవాఖానలు తనిఖీ చేసిన టాస్క్ఫోర్స్ బృం దాలు నివేదికను సమర్పించాయి