హైదరాబాద్, జులై 25(నమస్తే తెలంగాణ): ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ జనరల్ మేనేజర్‌గా సమీర్‌కుమార్ వర్మ నియమితులయ్యారు. ఈ మేరకు ఎఫ్‌సీఐ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుత జీఎం దీపక్ శర్మను నార్త్-ఈస్ట్ జోనల్ ఆఫీసర్‌గా బదిలీ చేసింది. నార్త్ జోనల్ ఆఫీసర్‌గా ఉన్న సమీర్‌కుమార్ వర్మను తెలంగాణ జీఎంగా నియమించింది.