Samagra Kutumba Survey | హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ హయాంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే (ఎస్కేఎస్)ను ఎవరు చేశారో? ఎలా చేశారో? ఆ నివేదిక ఎక్కడ పెట్టారో? తనకు తెలియదని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. మంగళవారం క్యాబినెట్ సమావేశం ముగిసిన తర్వాత అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. రాష్ట్రంలోని 56% బీసీలు, 17.5% ఎస్సీల సమస్యలకు శాశ్వత పరిషారం చూపబోతున్నట్టు చెప్పారు. కులగణన, ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ నుంచే రోడ్‌మ్యాప్ ఇస్తున్నామని, ఈ అంశంలో ప్రధానిపై కూడా ఒత్తిడి పెరుగుతుందని తెలిపారు. పార్టీలు, కుల సంఘాలు చెప్పే జనాభా శాతానికి ఆధారాలు లేవని, అవన్నీ కలుపుకుంటూ వెళ్తే జనాభా 200% దాటుతుందని చె ప్పుకొచ్చారు. ఎస్సీ వర్గీకరణ విషయం లో సుప్రీం తీర్పు, మంత్రివర్గ ఉపసం ఘం, ఏకసభ్య కమిషన్ సిఫార్సుల ప్రకా రం వెళ్తామని చెప్పారు. రెండు గంటలకుపైగా కొనసాగిన మంత్రివర్గ సమావేశం లో కులగణన సర్వే నివేదిక, వర్గీకరణపై ఎస్సీ కమిషన్ నివేదికను ఆమోదించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే నివేదికను ఎంసీఆర్హెచ్చార్డీఐ వెబ్సైట్ నుంచి ప్రభు త్వం తొలిగించింది. ఎస్కేఎస్ డాటాకు, తాజా కులగణన సర్వేకు పొంతన లేదు. అప్పటికీ, ఇప్పటికీ జనాభా తగ్గినట్టు వెల్లడైంది. ఇదే అంశంపై కేటీఆర్ అసెంబ్లీలో నిలదీశారు. దీంతో అప్పటివరకు ఎస్కేఎస్ను గుర్తించబోమంటూ చెప్పుకొచ్చిన సీఎం రేవంత్ ఎస్కేఎస్ నివేదికను తెప్పించుకొని తాజా కులగణనతో పోల్చారు. ఎస్కేఎస్ డాటా ప్రభుత్వ వెబ్సైట్లలో లేదని బుకాయించారు. కా నీ ఎంసీఆర్హెచ్చార్డీఐ సైట్లో ఉన్నదని తేలింది. కొద్దిసేపటికే ఆ సైట్ నుంచి ని వేదికను తొలిగించారు. ‘కాంగ్రెస్ అబద్ధాలను కేటీఆర్ ఎండగట్టగానే అధికారిక వెబ్సైట్ నుంచి ఎస్కేఎస్ నివేదికను తొలిగించారు’ అంటూ బీఆర్ఎస్ నేత క్రిశాంక్ ట్వీట్ చేశారు. దీనిని కేటీఆర్ రీ ట్వీట్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుత ప్రదర్శన అంటూ ఎద్దేవా చేశారు.