RS Praveen Kumar |హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 23 (నమస్తే తెలంగాణ): సింగరేణి బొగ్గు బ్లాకుల వ్యవహారం ప్రభుత్వంలోని అవినీతిని బట్టబయలు చేస్తున్న క్రమంలో బీఆర్ఎస్ అగ్రనేతలే లక్ష్యంగా సర్కార్ తెరలేపిన డైవర్షన్ పాలిటిక్స్‌ను రోజుకో మలుపు తిప్పుతున్నది. ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారమంటూ దానిపై దర్యాప్తునకు ఓ సిట్‌ను ఏర్పాటుచేసిన ప్రభుత్వం.. పోలీసు అధికారులను అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ నేతలే లక్ష్యంగా వేధింపులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఈ ఎత్తుగడలో భాగంగా ఇప్పటికే బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావును ఏడుగంటల పాటు విచారించిన సిట్ శుక్రవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను విచారణకు పిలిచింది. ఆ తరువాత తాజాగా మరో నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు సిట్ చీఫ్ లీగ ల్ నోటీసులివ్వడం వివాదాన్ని మరో మలు పు తిప్పింది.
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న వారిని నోటీసుల పేరుతో గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తున్నది. తా జాగా బీఆర్ఎస్ నేత, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు సీపీ, సిట్ అధికారి సజ్జనార్ శుక్రవారం లీగల్ నోటీ సు పంపారు. తనపై చేసిన ఆరోపణలకు రెండు రోజుల్లో ఆధారాలు ఇవ్వాలని పేర్కొన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ప్రవీణ్‌కుమార్.. సిట్ అధిపతి, సీపీ సజ్జనార్ మీద ఏడు క్రిమినల్ కేసులు ఉ న్నాయని, వాటిపై దర్యాప్తు జరిపేందుకు మరో సిట్‌ను ఏర్పాటు చేయాలని డిమాం డ్ చేసిన విషయాన్ని నోటీసులో ప్రస్తావించారు. ఆర్ఎస్పీ వ్యాఖ్యలు బాధ్యతారహితంగా, తప్పుదోవ పట్టించేవిగా, ఎటువం టి ఆధారాల్లేకుండా, తన పరువుకు నష్టం కలిగించేవిగా ఉన్నాయని పేర్కొన్నారు. సిట్ దర్యాప్తును ప్రభావితం చేసేలా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రవీణ్‌కుమార్ ఆరోపించినట్టుగా తనపై ఉన్న ఏడు క్రిమినల్ కేసులకు సంబంధించిన పూర్తి వివరాలను రెండు రోజుల్లోపు ఇవ్వాలని తెలిపారు.