హైదరాబాద్, సిటీబ్యూరో, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): దేవాదాయ ధర్మాదాయశాఖ కమిషనర్గా ఆశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ మంగళవారం పూర్తి బాధ్యతలను స్వీకరించారు. ఈనెల 4న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. నిరుడు కమిషనర్గా పనిచేసిన వెంకట్రావు గతనెలాఖరులో పదవీ విరమణ చేయడంతో కమిషనర్గా ఎవరినీ నియమించలేదు.
వెంకట్రావు, హన్మంతరావు తదితరుల పేర్లు వినిపించినప్పటికీ శైలజారామయ్యర్కే అదనంగా బాధ్యతలు అప్పగించారు. దీంతో బొగ్గులకుంటలోని ఎండోమెంట్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన శైలజారామయ్యర్.. కొన్ని ఫైళ్లను పరిశీలించినట్టు సిబ్బంది తెలిపారు.