డాక్టర్‌గా ప్రాణం విలువ నాకు తెలుసు
- హింస ముమ్మాటికీ తప్పే
- నా వ్యాఖ్యలు బాధిస్తే క్షమించండి
- నటి సాయిపల్లవి వీడియో సందేశం
హైదరాబాద్, జూన్ 18: ఒకరి ప్రాణం తీసే హక్కు మరొకరికి లేదని, డాక్టర్‌గా ప్రాణం విలువ తనకు తెలుసని నటి సాయిపల్లవి తెలిపింది. కొన్ని రోజులుగా తన పై జరుగుతున్న ప్రచారంపై ఆమె వివరణ ఇచ్చింది. తాను ఎవరినీ కించపరిచే వ్యాఖ్యలు చేయలేదని వెల్లడించింది. విరాటపర్వం సినిమా ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలపై కొన్ని వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేయటంతో ఆమె తాజాగా స్పందించింది. ఈ మేరకు శనివారం ఒక వీడియో సందేశాన్ని విడుదల చేసింది. అందులో.. ‘ఒకరి ప్రా ణం తీసే హక్కు మరొకరికి లేదు.
నా దృష్టిలో హింస ముమ్మాటికీ తప్పే. ఒక మెడికల్ గ్రాడ్యుయేట్‌గా ప్రాణం విలువ నాకు తెలుసు. కొన్ని రోజులుగా నాపై విమర్శలు వస్తున్నాయి. నా వ్యాఖ్యలను తప్పుదోవ పట్టిస్తూ ప్రచారం చేస్తున్నారు. వాటిపై స్పష్టత ఇచ్చేందుకు మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు నా అభిప్రాయాన్ని చెప్పటానికి కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి వస్తున్నది. నేనిచ్చిన ఇంటర్వ్యూలో మంచి మనుషులుగా జీవించాలనే ఉద్దేశంతోనే మాట్లాడా. కానీ నా ఇంటర్వ్యూను మొత్తం చూడలేదో, లేక తప్పుగా అర్థం చేసుకున్నారో గానీ ఏవేవో ప్రచారం చేశారు. నేను ఎవరినీ కించపరిచే వ్యాఖ్యలు చేయలేదు. నా మాటల వల్ల ఎవరూ ఇబ్బంది పడకూడదు. ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించండి. గడ్డు పరిస్థితుల్లో నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు’ అని పేర్కొన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

