అమరచింత, జూన్ 28 : తెలంగాణ మలిదశ ఉద్యమ కళాకారుడు సాయిచంద్ రెండో వర్ధంతి సందర్భంగా వనపర్తి జిల్లా అమరచింత కొత్త బస్డాండ్ ఆవరణలో ఏడు అడుగుల క్యాంసవిగ్రహాన్ని ఆదివారం సాయంత్రం 4గంటలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆవిష్కరించనున్నారు. అనంతరం సాయిచంద్ చదువుకున్న జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో బహిరంగ సభ నిర్వహించనున్నారు.
ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లను శనివారం గిడ్డంగుల సంస్థ మాజీ చైర్పర్సన్ రజినీ సాయిచంద్‌తోపాటు మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పరిశీలించారు. ఉమ్మడి జిల్లాలోని కళాకారులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివస్తారని రజినీసాయిచంద్ వెల్లడించారు.