BRS | హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలో బీఆర్ఎస్ ప్రకంపనలు సృష్టిస్తున్నది. మహా నాయకులంతా బీఆర్ఎస్ బాటలో నడిచేందుకు కదిలివస్తున్నారు. ఇప్పటికే భారత రాష్ట్ర సమితిలో మహారాష్ట్రకు చెందిన పలువురు సీనియర్ రాజకీయ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, రైతుసంఘాల నేతలు చేరటంతోపాటు, పలు స్థానికపార్టీలు సైతం విలీనమయ్యాయి. తాజాగా ప్రముఖ దళిత సాహితీవేత్త, మహారాష్ట్ర గోర్కీగా పేరొందిన అన్నాబావు సాఠే మనుమడు, మానవహిత్ డెమొక్రటిక్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు సచిన్ సంజయ్భావుసాఠే బీఆర్ఎస్లో చేరారు. తన పార్టీని బీఆర్ఎస్లో విలీనం చేశారు. ప్రగతిభవన్‌లో బుధవారం బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సమక్షంలో పార్టీ సభ్యులతోసహా బీఆర్ఎస్లో చేరగా, కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాల సుమన్, జీవన్‌రెడ్డి, నాయకులు రవీందర్‌సింగ్, మహారా్రష్ట్ర బీఆర్ఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి హిమాన్షు తివారీ, కిసాన్‌సెల్ అధ్యక్షుడు మాణిక్ కదమ్, పుణె డివిజన్ కోఆర్డినేటర్ దేశ్‌ముఖ్, రైతు నాయకుడు శంకరన్న దోండ్గె, కొంకణ్ కోఆర్డినేటర్ విజయ్మోహితే, మరాఠ్వాడా కోఆర్డినేటర్ సోమనాథ్ థోరట్, కేంద్ర మాజీ మంత్రి అస్లం షేర్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
మహారాష్ట్రకు చెందిన సచిన్సాఠే, మాజీ జడ్పీ సభ్యులు వైనతేయ వైభవ్కదం, ప్రమోద్ విఠల్జాదవ్, రామదాస్ఘరత్, పంచాయతీ సమితి సభ్యుడు మేనేష్ రాహుల్గాడ్సే, ఇండియన్ ఎయిర్పోర్ట్ వరర్స్ యూనియన్ మాజీ ప్రెసిడెంట్ అజర్‌ఖాన్, రీజినల్ కార్యదర్శి వభూ వసంతరావుకదం, మాజీ కార్పొరేటర్ శ్రీనివాస్ఇస్తారి ఎలిగేటి, మాజీ సర్పంచ్‌లు శంకర్గాడ్సే, శంభురాజేధావలే, జయబాలకృష్ణపవార్, ఎన్సీపీ ఆరేటర్సెల్ నాగ్‌పూర్ ప్రెసిడెంట్ వినోద్మోటే గెవ్నాయ్, యునైటెడ్ ముస్లిం ఫోరమ్ విదర్భ అధ్యక్షుడు డాక్టర్ అస్లాంబారీ, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లాబోర్డు హింగోలి అధ్యక్షుడు మౌలానా జునైద్ఖాస్మీ, మౌలానాఖాస్మీ అబ్దుల్లతీఫ్, ఏఐఎంఐఎం నేతలు జమియత్ ఉల్మా, మౌలానా షఫీయుల్లాసాహబ్, ఆమ్ ఆద్మీపార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి మౌలానా అబూబకర్, మాజీ పంచాయతీ సమితి చైర్మన్లు మహేశ్ టేలే పాటిల్, హనుమంతరావుమోతె, దిలీప్‌రావు గైక్వాడ్, సంతోష్సుర్తే, సుభాష్టేలే పాటిల్, ఓంకార్ ఎరార్, దీపక్తాంబే, రామ్ఘ్రునాథ్ చాటే, షుగర్ ఫ్యాక్టరీ డైరెక్టర్ శత్రుగన్తాప్సే, బీజేపీ యువమోర్చా నాయకురాలు అనుసూయబికడ్, శ్రీకృష్ణచాటే, వసంత్చాటే, కేశవ్ప్యాడ్, యోగేష్సక్రే, రామేశ్వర్లగాసర్, శ్రీకాంత్కమ్లే, కపిల్ధావద్, సర్పంచ్ యూనియన్ అధ్యక్షుడు రాజ్భీమ్రావ్ పాటిల్, అశోక్నిప్టే, ఓంప్రకాశ్ సబే, హనుమంత్ మాత్రే, టీచర్స్ అసోసియేషన్ నేత వైభవ్శెట్టి, సమతా పార్టీ నేత శంభాజీమాసే, భీమ్ ఆర్మీ సేన నాయకుడు మహేశ్ధోలారే, శంభాజీ బ్రిగ్రేడ్ నేతలు చంద్రశేఖర్ఘాడ్గే, నీలేశ్ కాంబ్లే, సందీప్ముగ్సే, శివాజీపవార్, సాజిద్సయ్యద్, కామ్‌గార్ ఆఘాడి నేత నవనాథ్జాదవ్, ఎన్సీపీ బీడ్ మహిళా ప్రెసిడెంట్ నీలం సునీల్పోక్లే, ఆర్పీఐ షోలాపూర్ జిల్లా అధ్యక్షుడు శివభావు గైక్వాడ్, గణేశ్జీభగత్, మలుజిరాజే వాఘ్మారే, వాడేకర్ స్వప్నిల్, కిషోర్ తరసర్, అన్నాసాహెబ్ జాదవ్, సంజయ్ దేశ్‌ముఖ్, సయ్యద్ రియాజ్, సయ్యద్ ఇనాయత్ అలీ, పోలీస్ ఫ్రెండ్ సరిల్ దరి సంతోష్, శుక్లాఅవదేశ్, జడ్పీ సభ్యుడు సునీల్ లహానే, స్వాభిమాన్ మంచ్ నేతలు కృష్ణ గైక్వాడ్, జాఫర్ షేక్, ప్రహార్ పార్టీ నేత సంజయ్షిండే, అశోక్గైక్వాడ్, శివసేన పార్లమెంట్ సమన్వయకర్త అవినాష్థాంబ్రే, ప్రతీక్అశోక్ వంకర్, ఆల్ ఇండియా మీడియా సురక్ష ఫోరమ్ నేత రాజవిందర్ కౌర్ షెర్గిల్, రాలేగావ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడు దయానంద్ గౌతమ్ నరంజే, సామాజిక కార్యకర్త జాన్మంత్రి, ప్రియానాగదేవత తదితరులు ఉన్నారు.
తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ దళితులు, రైతుల కోసం చేస్తున్న కృషి మనసుకు హత్తుకునేలా ఉన్నదని సచిన్సాఠే చెప్పారు. ఈ నేపథ్యంలోనే సచిన్సాఠే కేసీఆర్ ప్రభుత్వ నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు. తెలంగాణ నమూనాను అర్థం చేసుకుని, ప్రజలకు కలిగే ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, మానవహిత్ డెమోక్రటిక్ పార్టీని బీఆర్ఎస్లో విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు.
మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని వాటేగావ్‌లో 1920లో దళిత కుటుంబంలో జన్మించిన తుకారాం భావు సాఠే, అన్నాభావు సాఠేగా, ఫూలే వారసుడిగా పేరు పొందారు. మహారాష్ట్రకు చెందిన ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, సంఘసంసర్తల్లో, సాహితీవేత్తల్లో, జానపద కవుల్లో ఒకరు. 14 ఏండ్ల ప్రాయంలోనే మిల్ వరర్స్ యూనియన్ నాయకత్వంలో ముంబయి కార్మికుల సమ్మెలో పాల్గొన్నారు. మహద్‌లోని ప్రసిద్ధ చావ్దార్ లేక్ సత్యాగ్రహంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేదర్ సహచరుడు ఆర్పీ మోరేతో పరిచయం పొంది లేబర్ స్టడీసరిల్లో చేరాడు. దళిత యువక్సంఘ్ అనే సాంసృతిక బృందాన్ని ఏర్పాటు చేసి కార్మికుల నిరసనలు, ఆందోళనలపై కవితలు అల్లాడు. ప్రముఖ రచయితలు ప్రేమ్‌చంద్, ఫైజ్ అహ్మద్ ఫైజ్, మంటో, ఇస్మత్ చుగ్తాయ్, రాహుల్ సాంకృత్యాయన్, ముల్రాజ్ ఆనంద్ వంటి కవులు సభ్యులుగా ఉన్న ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్‌లో సభ్యుడిగా పనిచేశారు.
ఆయన రచనలు రాష్ట్రవ్యాప్తంగా ప్రసిద్ధి చెందటమే గాక రష్యన్ భాషలోకి అనువాదం కావటం గర్వకారణం. లండన్ రాయల్ థియేటర్లో సైతం ప్రదర్శనకు నోచుకున్నాయి. 1943లో లాల్ బావటా కళాపథక్ని స్థాపించి కుల దౌర్జన్యాలు, కార్మికుల హకుల కోసం పోరాడారు. ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ ఏర్పాటు చేసి, జాతీయ అధ్యక్షుడిగా సేవలందించారు. సాఠే రచించిన ఆరు నవలలు చలనచిత్రాలుగా రావటం గర్వకారణం. సాఠే మార్సిస్ట్ ఉద్యమాలతో ప్రభావితమైనా తరువాత అతను అంబేదరైట్ అయ్యాడు. దళిత సాహిత్యం వ్యవస్థాపక పితామహుడిగా గుర్తింపు పొందారు. సంయుక్త మహారాష్ట్ర ఉద్యమంలోనూ కీలక పాత్ర పోషించారు. మహారాష్ట్ర మాగ్జిమ్ గోరీగా పేరుపొందిన సాఠే 1969లో మరణించారు. సాఠే జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తుండటంతోపాటు అముద్రిత రచనలను వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నాలను చేస్తుండటం మహారాష్ట్రలో సాఠేకున్న గౌరవానికి నిదర్శనం.
అన్నాభావు సాఠే మనవడు సచిన్ సాఠే తాత బాటలోనే కార్మికులు, దళితులు, అట్టడుగు వర్గాల ప్రజల కోసం పనిచేస్తున్నారు. అంతేగాకుండా అన్నాభావు సాఠే ఆశయాలను నెరవేర్చేందుకు, ఆయన రచనలను తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారు. అందుకు మానవహిత్ డెమొక్రటిక్ పార్టీని స్థాపించారు. వ్యవస్థాపక అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.