Sabitha Indra Reddy | భూములు ఎక్కడ ఉంటే అక్కడ గద్దల్లా వాలిపోతున్నారు.. రేవంత్ సర్కార్‌పై సబితా ఇంద్రారెడ్డి ఎద్దేవా
Sabitha Indra Reddy |కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల బాధలు పట్టించుకునే పరిస్థితిలో లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. రేవంత్ ప్రభుత్వం అంతా భూముల చుట్టే తిరుగుతుందని అన్నారు.
Sabitha Indra Reddy |కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల బాధలు పట్టించుకునే పరిస్థితిలో లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. రేవంత్ ప్రభుత్వం అంతా భూముల చుట్టే తిరుగుతుందని అన్నారు. భూములు ఎక్కడ ఉంటే అక్కడ గద్దల్లా వాలిపోతున్నారని తెలిపారు. ప్రజలు ఏమైపోయినా మా ఖజానా నిండాలని కాంగ్రెస్ మంత్రులు భావిస్తున్నారని విమర్శించారు.
రంగారెడ్డి జిల్లా కోహెడ్ పండ్ల మార్కెట్‌ను మాజీ మంత్రి హరీశ్‌రావుతో కలిసి సబితా ఇంద్రారెడ్డి సందర్శించారు. వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. కోహెడకు పండ్ల మార్కెట్ వస్తే స్థానిక ప్రజలు బాగుపడతారని కేసీఆర్ భావించారని తెలిపారు. కానీ ఆ స్థలాన్ని ఆక్రమించేందుకు కాంగ్రెస్ నాయకులు కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టాలంటే వేరే చోట స్థలం కేటాయించవచ్చు కదా అని ప్రశ్నించారు. మార్కెట్‌ను కాపాడుకోవడానికి అందరూ పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. రైతులు, స్థానికులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

Devireddy Sudheer Reddy
మార్కెట్ స్థలాన్ని పెద్దలకు కట్టబెట్టాలని చూస్తే ఊరుకోం: ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వార్నింగ్
పండ్ల మార్కెట్ కోసం బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ 170 ఎకరాల స్థలం కేటాయించారని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో మార్కెట్ నిర్మించాలని నిధులు కూడా కేటాయించారని పేర్కొన్నారు. ఆ మార్కెట్ స్థలంపై ఇప్పుడు రియల్ ఎస్టేట్ మాఫియా కన్ను పడిందని అన్నారు. మార్కెట్ స్థలాన్ని పెద్దలకు కట్టబెట్టాలని చూస్తే ఊరుకోమని హెచ్చరించారు. మార్కెట్‌ను అభివృద్ధి చేసే వరకూ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Navaratri Brahmotsavams | తిరుమలలో వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

