తెలంగాణ అస్తిత్వానికి ప్రమాద ఘంటికలు
రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అస్తిత్వమే ప్రమాదంలో పడిందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మె ల్యే సబితాఇంద్రారెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. త్యాగాలు.. పోరాటాల పునాదులతో ఏర్పడిన తెలంగాణలో టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ ఏకమై తెలంగాణ ఉనికికే ముప్పు తెస్తున్నాయని వి మర్శించారు.
- టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ పార్టీలది ఒకటే ఎజెండా
- పాలమూరు- రంగారెడ్డికి మాత్రం జాతీయ హోదా ఇవ్వరు
- బనకచర్ల పనులు మాత్రం శరవేగంగా జరిపిస్తరు
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మాజీ మంత్రి సబిత ఫైర్
కల్వకుర్తి, జూన్ 4: రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అస్తిత్వమే ప్రమాదంలో పడిందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మె ల్యే సబితాఇంద్రారెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. త్యాగాలు.. పోరాటాల పునాదులతో ఏర్పడిన తెలంగాణలో టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ ఏకమై తెలంగాణ ఉనికికే ముప్పు తెస్తున్నాయని వి మర్శించారు. మార్పు పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తమ స్వలాభం కోసం అభివృద్ధి శిఖరంపై ఉన్న తెలంగాణ రాష్ర్టాన్ని అధోగతి పాల్జేసిందని తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు.
గురువారం నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కొట్ర సమీపంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అధ్యక్షతన కల్వకుర్తి నియోజకవర్గ స్థాయి డిజిటల్ సభ్యత్వ నమోదు, ఎస్ఐఆర్పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏపీలో టీడీపీ, తెలంగాణలో కాంగ్రెస్, కేంద్రంలోని బీజేపీ ఒకే డైరెక్షన్లో పనిచేస్తూ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో తీవ్ర అన్యాయం చేస్తున్నాయని ధ్వజమెత్తారు.
దీనికి ప్రత్యక్ష ఉదాహరణ.. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయహోదా ఇవ్వకపోగా.. బనకచర్ల ప్రాజెక్టును మాత్రం శరవేగంగా పూర్తిచేయడానికి మూడు పార్టీలు సహకరించుకుంటున్నాయని మండిపడ్డా రు. మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ మాట్లాడుతూ కృష్ణానదిలో తెలంగాణకు 500 టీఎంసీలు కేటాయించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సభ్వత్వాల నమోదు జిల్లా ఇన్చార్జి మెట్టు శ్రీనివాసులు, నియోజకవర్గ ఇన్చార్జి రజనీ సాయిచంద్, రాష్ట్ర పుడ్ కమిషన్ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, మిషన్ భగీరథ రాష్ట్ర వైస్ చైర్మన్ వెంకటేశ్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Japan | జపాన్‌లో సాయంత్రం సమయంలో ఆహార పదార్థాలపై రాయితీ.. ఎందుకో తెలుసా..?
Mahabubnagar | యువకుల కార్ల రేసింగ్ సరదా.. మహిళ ప్రాణం బలి!
Saluru | ఎన్నికల కోసం పెళ్లి.. చివరికి సీటు జనసేనకు! టీడీపీ నేతకు షాక్ మీద షాక్!
రూ.280 కోట్ల పనులకు మోక్షమెప్పుడో.. రోడ్ల పనుల డిమాండ్‌తో మక్తల్–నారాయణపేట రహదారిపై చిట్టెం పాదయాత్ర..
Ranabaali | ‘రణబాలి’ ఫస్ట్ డే కలెక్షన్స్.. విజయ్ దేవరకొండకు ఈ చిత్రంతోను నిరాశేనా ..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

