హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతుంటే మహిళా కమిషన్ ఎందుకు స్పందించలేదని మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. మహిళా ఎమ్మెల్యేలను అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అవమానపర్చినప్పుడు ఎందుకు స్పందించలేదని నిలదీశారు. తన ప్రసంగంలో దొర్లిన పొరపాటుకు కేటీఆర్ బహిరంగంగా క్షమాపణ కూడా చెప్పారని, అయినా మహిళా కమిషన్ నోటీసులు ఇవ్వటం ఏమిటని అన్నారు.
శనివారం తెలంగాణభవన్‌లో మాజీమంత్రులు సునీతాలక్ష్మారెడ్డి, సత్యవతిరాథోడ్, ఎమ్మెల్సీ వాణీదేవి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు ముక్తవరం సుశీలారెడ్డితో కలిసి సబితాఇంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. హుందాతనంతో క్షమాపణ చెప్పిన కేటీఆర్‌ను మహిళాలోకం స్వాగతిస్తున్నదని.. అయినా కొందరు మహి ళా నేతలు ఏదేదో మాట్లాడుతున్నారని అభ్యంతరం వ్యక్తంచేశారు. ఇద్దరు మహిళా మంత్రు లు, మహిళా కమిషన్ వేగంగా స్పందించారని.. 8 నెలల్లో మహిళలపై 1,800 లైంగిక దాడులు, హత్యలు జరిగితే ఎందుకు స్పందించలేదని నిలదీశారు.
అత్యాచారానికి గురైన ఒక్క మహిళనైనా పరామర్శించారా? అని ప్రశ్నించారు. అసెంబ్లీలో సీఎం, డిప్యూటీ సీఎం తమను అనకూడని మాటలంటే ఈ మ హిళా కమిషన్, మంత్రులు ఎకడికి వెళ్లారని కడిగిపారేశారు. కేటీఆర్‌కు కేసీఆర్ సంసారం నేర్పారు కాబట్టే క్షమాపణ చెప్పారని, సీఎం రేవంత్‌కు ఎవరూ సంసారం నేర్పినట్టు లేరని చురకలంటించారు. గతంలో అసెంబ్లీ సాక్షిగా డీకే అరుణకు కేటీఆర్‌తో కేసీఆర్ క్షమాపణ చెప్పించారని.. ఇది తమ సంసారమని అన్నారు.
హరీశ్‌రావు క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని ఖండిస్తున్నామ న్నారు. సునీతాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ అ సెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ పైచేయి సాధించటంలో కేటీఆర్, హరీశ్‌రావు పాత్ర ప్రముఖంగా ఉన్నదని.. అందుకే వారిని సీఎం, కాం గ్రెస్ నేతలు టార్గెట్ చేస్తున్నారన్నారు. హరీశ్‌రావు ఒత్తిడితోనే ఈ మాత్రం రుణమాఫీ అ య్యిందని స్పష్టంచేశారు. సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ సచివాలయం దగ్గర తెలంగాణ తల్లి విగ్రహం స్థానంలో రాజీవ్‌గాంధీ విగ్ర హం పెట్టినపుడే మహిళలను కాంగ్రెస్ ప్రభు త్వం అవమానించిందన్నారు.
మహిళలకు ఈ 8 నెలల్లో కాంగ్రెస్ చేసింది శూన్యమని విమర్శించారు. కొండా సురేఖ, సీతక్క కాంగ్రెస్ నుం చి రాలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవుపలికారు. వాణీదేవి మాట్లాడుతూ బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలకు సీఎం క్షమాపణ చెప్పకుండా మిగతా విషయాలు మాట్లాడటం దండగ అన్నారు.