Sabitha Indra Reddy | సునితా లక్ష్మారెడ్డికో, సబితా ఇంద్రారెడ్డికో జరిగిన అవమానం కాదు ఇది.. మహిళా సమాజానికి జరిగిన అవమానం అని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కాంగ్రెస్ 1000 రోజుల పాలన వైఫల్యాన్ని నిరసిస్తూ నల్ల టీషర్టులతో అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య తోపులాట జరిగింది. మహళా ఎమ్మెల్యేలు అని చూడా కూండా జుట్టు పట్టి, చీరలాగి అమానవీయంగా ప్రర్తించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..సునితా లక్ష్మారెడ్డి చీర లాగుతుంటే కేటీఆర్ జోక్యం చేసుకోకపోయి ఉంటే ఇవాళ మమ్మల్ని అక్కడే పడేసి తొక్కేవారని ఆవేదన వ్యక్తం చేశారు.
సమయానికి కేటీఆర్ రావడం వల్లే మేము సేవ్ అయ్యామమని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను ప్రశ్నిస్తే చీర లాగడం, జుట్టు పట్టుకొని లాగడం, గొంతు నొక్కడం ఏంటని మండిపడ్డారు. మహిళలను కోటిశ్వరులను చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను అవమాన పరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదా ప్రజా పాలన.. దీనిని సీఎం రేవంత్ రెడ్డి సమర్ధిస్తారా అని నిలదీశారు. సమస్యలను ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు పెట్టడం, అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు.
సునితా లక్ష్మారెడ్డికో, సబితా ఇంద్రారెడ్డికో జరిగిన అవమానం కాదు ఇది.. మహిళా సమాజానికి జరిగిన అవమానం
సునితా లక్ష్మారెడ్డి చీర లాగుతుంటే కేటీఆర్ జోక్యం చేసుకోకపోయి ఉంటే ఇవాళ మమ్మల్ని అక్కడే పడేసి తొక్కేవారు
సమయానికి కేటీఆర్ రావడం వల్లే మేము సేవ్ అయ్యాము
ప్రశ్నిస్తే చీర లాగడం,… https://t.co/BQlVwbVveR pic.twitter.com/Gwvpwcg3iF
— Telugu Scribe (@TeluguScribe) September 7, 2026