హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ) : అయ్యప్ప భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో ఈ నెల 18న ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశామని మంగళవారం రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. మైలాలి-కొల్లం మధ్య 8 సర్వీసులు, మచిలీపట్నం-కొల్లం మధ్య 10 సర్వీసులు ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. డిసెంబర్ 6 నుంచి 25, లేదా జనవరి 1 వరకు ప్రత్యేక రైళ్లు నడుస్తాయని వెల్లడించారు.