రైతులను కేంద్రం ఆదుకోవాలి
రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలతో లక్షల ఎకరాలలో పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని తెలంగాణ రైతురక్షణ సమితి అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
- ప్రధానికి రైతురక్షణ సమితి అధ్యక్షుడి లేఖ
హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలతో లక్షల ఎకరాలలో పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని తెలంగాణ రైతురక్షణ సమితి అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు బుధవారం ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలతో లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగినప్పటికీ కేంద్రప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించటం శోచనీయమని తెలిపారు. కేంద్రప్రభుత్వం సాంకేతిక కారణాలు చూపి తప్పించుకోకుండా, మానవతా ధృక్పథంతో ప్రతి ఎకరాకు రూ.10 వేలు సహాయం అందించాలని కోరారు. మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకానికి ప్రస్తుతం అవలంబిస్తున్న విధానం వల్ల రైతులు వారికి తెలియకుండానే ప్రతి ఎకరాకు రూ.10 నుంచి రూ.15 వేలు నష్టపోతున్నారని చెప్పారు. ఈ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తే రైతుకు లాభం చేకూరుతుందని సూచించారు. కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా కేంద్రప్రభుత్వం అందిస్తున్న సహాయంతో ఏ రైతుకు ప్రయోజనం లేదని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఆ ఉత్తర్వులు బీజేపీ కార్యకర్తలకు రోజ్గార్ గ్యారెంటీ’
అద్వానీకి ఛాతీలో ఇన్ఫెక్షన్ దవాఖానలో చేరిక
సద్దుల పొద్దు.. పూల సద్దు!
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

