Rythu Bandhu | రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీ కొనసాగుతున్నది. మూడో రోజు 26.50 లక్షల ఎకరాలకు 10.89 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1325.24 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. దీంతో ఇప్పటి వరకు మూడు రోజుల్లో 50.43 లక్షల మంది రైతులకు రూ.3246.42 కోట్లను ఆయా రైతుల ఖాతాల్లో జమయ్యాయి. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. వ్యవసాయం, రైతు బాగుంటేనే సమాజం బాగుంటుందని, అందుకే జనాభాలో అధికశాతం ఆధారపడిన వ్యవసాయరంగం బలోపేతానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేయూతనిస్తున్నారని పేర్కొన్నారు.