హైదరాబాద్ : ఇక రేపట్నుంచి తెలంగాణ పల్లెల్లో రైతుల ఫోన్లు టింగ్ టింగ్‌మని మోగనున్నాయి. బ్యాంకులు తెరవగానే రైతుల ఖాతాల్లో రైతుబంధు జమ కానుంది. ఈ యాసంగి సీజన్లో సుమారు 66 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయంగా రూ.7,600 కోట్లను ప్రభుత్వం పంపిణీ చేయనున్నది.
అర్హులైన ఏ ఒక్కరూ నష్టపోకుండా చివరి రైతు వరకు రైతుబంధు పెట్టుబడి సాయం అందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యవసాయ, ఆర్థికశాఖల అధికారులు పెట్టుబడి సాయం పంపిణీపై పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. రైతుబంధు సాయం.. ఈ సీజన్‌తో రూ.65 వేల కోట్లకు చేరుతుండటం గమనార్హం.
పదో విడత రైతుబంధు రూ. 7676.61 కోట్లు : మంత్రి శ్రీ @SingireddyTRS
అర్హులయిన 70.54 లక్షల మంది రైతుల ఖాతాలలోకి రేపటి నుండి ఎకరానికి రూ.5 వేలు జమ
కోటి 53 లక్షల 53 వేల ఎకరాలకు యాసంగి రైతుబంధు
మొత్తం పదో విడతతో రూ. 65,559.28 కోట్లు రైతుల ఖాతాల్లోకి.#RythuBandhu
(File Photo) pic.twitter.com/gmexSX5CNE
— BRS Party (@BRSparty) December 27, 2022