రెండో రోజు రైతుబంధు 1,278 కోట్లు
రెండోరోజు రైతుబంధు పంపిణీ కొనసాగింది. మంగళవారం రెండెకరాల భూమి ఉన్న 16.99 లక్షల మంది రైతుల ఖాతాల్లో తెలంగాణ సర్కారు రూ.1,278.60 కోట్లు జమ చేసింది. రెండోరోజు 25.57 లక్షల ఎకరాలకు రైతుబంధు ఇచ్చింది.
- 6.99 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేసిన తెలంగాణ సర్కారు
హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): రెండోరోజు రైతుబంధు పంపిణీ కొనసాగింది. మంగళవారం రెండెకరాల భూమి ఉన్న 16.99 లక్షల మంది రైతుల ఖాతాల్లో తెలంగాణ సర్కారు రూ.1,278.60 కోట్లు జమ చేసింది. రెండోరోజు 25.57 లక్షల ఎకరాలకు రైతుబంధు ఇచ్చింది. దీంతో రెండు రోజుల్లో ప్రభుత్వం 39.54 లక్షల మంది రైతులకు సంబంధించిన 38.42 లక్షల ఎకరాలకు రూ.1,921.12 కోట్లను పంపిణీ చేసినట్టు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి వెల్లడించారు. రైతుబంధు పథకంతో తెలంగాణలో సాగువిప్లవం మొదలైందని అన్నారు. సాగునీరు అందుబాటులోకి రావడం, ఉచిత కరెంటుతో ప్రతి ఎకరా సాగులోకి వచ్చిందని వెల్లడించారు. దీంతో వ్యవసాయ రంగం చుట్టూ అల్లుకున్న రంగాలు బలోపేతం అవుతున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో వ్యవసాయానికి మొదటి ప్రాధాన్యం ఇచ్చి ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. ఆహారశుద్ధి పరిశ్రమలతో తెలంగాణ వ్యవసాయ రంగం రూపురేఖలు మారనున్నాయని వెల్లడించారు. ఆరుగాలం శ్రమించే రైతు నాలుగు పైసల లాభం కండ్ల చూడాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అని పేర్కొన్నారు. ఆ లక్ష్యంతోనే తెలంగాణ ప్రభుత్వం ముందుకుసాగుతున్నదని తెలిపారు.
తెలంగాణ రైతురాజ్యం
కేసీఆర్ వల్లే బువ్వ తింటున్నం నాకు 20 గుంటల భూమి ఉంది. ఇందులో మొక్కజొన్న పంట వేసుకొంటున్నాను. నాకు రైతుబంధు డబ్బులు రూ.2,834 వచ్చినయ్. బ్యాంకు ఖాతాలో పడినట్టు సెల్ఫోన్లో మెసేజ్ వచ్చింది. ఈ డబ్బులతో విత్తనాలు, ఎరువులు కొన్నాను. సీఎం కేసీఆర్ వల్లే బుక్కెడు బువ్వ తింటున్నం. ఈ పథకం రాకముందు విత్తనాలు, ఎరువుల కోసం అప్పులు చేయాల్సి వస్తుండె. ఇప్పుడు కేసీఆర్ సార్ వేస్తున్న రైతుబంధుతో విత్తనాలు, ఎరువులు కొనేందుకు అప్పులు చేయాల్సిన అవసరం లేదు. మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే రావాలి.
-బోనాసి రామస్వామి, చర్లతిర్మలాపురం, నాగర్కర్నూల్ జిల్లా
రెండో రోజు రైతుబంధు
- లబ్ధిపొందిన రైతులు 16.99 లక్షలు
- జమ చేసిన మొత్తం ;1278.60 కోట్లు
- ఎన్ని ఎకరాలు ;25.57 లక్షలు
రెండు రోజుల్లో మొత్తం
- లబ్ధిపొందిన రైతులు 39.54 లక్షలు
- జమ చేసిన మొత్తం ;1,921.12 కోట్లు
- ఎన్ని ఎకరాలు ;38.42 లక్షలు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

