రైతు ఆశీర్వాద సభ వాయిదా : డిప్యూటీ సీఎం భట్టి
వర్షాల నేపథ్యంలో రైతులకు, ప్రజలకు ఇబ్బందులు కలుగకూడదనే ఉద్దేశంతో రైతు ఆశీర్వాద సభను వాయిదా వేసినట్టు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.
- నేడు రైతు భరోసా నిధుల విడుదల: మంత్రి తుమ్మల
చింతకాని, జూన్ 29: వర్షాల నేపథ్యంలో రైతులకు, ప్రజలకు ఇబ్బందులు కలుగకూడదనే ఉద్దేశంతో రైతు ఆశీర్వాద సభను వాయిదా వేసినట్టు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రైతు భరోసా పంపిణీ పూర్తయిన అనంతరం రైతు ఆశీర్వాద సభ పేరుతో ముగింపు వేడుకలను మరింత వైభవంగా నిర్వహిస్తామని చెప్పారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం మత్కేపల్లి క్రాస్‌రోడ్డు వద్ద ఈ నెల 30న నిర్వహించాల్సిన రైతు ఆశీర్వాద సభా ప్రాంగణాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వైరా ఎమ్మెల్యే రాందాస్‌నాయక్, ఖమ్మం కలెక్టర్ దివాకర టీఎస్, సీపీ సునీల్‌దత్‌తో కలిసి డిప్యూటీ సీఎం భట్టి సోమవారం పరిశీలించారు. అనంతరం మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదిక నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైతు భరోసా పథకం నిధులను మంగళవారం విడుదల చేస్తారని వెల్లడించారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసే ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay | తమిళనాడు సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. దళపతిపై రౌడీ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు!
Singareni Karmika Garjana | రేపే సింగరేణి కార్మిక గర్జన.. 30 వేల మందిని సభకు సమీకరించేందుకు సన్నాహాలు
ప్రాణం తీసిన మెట్రో సీటు గొడవ.. ఢిల్లీలో మాజీ ఐఏఎస్ అధికారి అరెస్ట్
Indiramma Saree | ఇందిరమ్మ చీర.. ఇంటికి కర్టెన్!
Farmers | అన్నదాతతో సర్కార్ ఆటలు.. కరువు సమీక్షకు పిలిచి.. తీరా రైతులు వచ్చాక మీటింగ్ రద్దు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

