Siddipet | సాగునీటి కోసం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల రైతులు కదం తొక్కారు. కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా రిజర్వాయర్లు నింపి, రైతులకు సాగునీరు ఇవ్వాలనే డిమాండ్‌తో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహాపాదయాత్ర చేపట్టారు.
చిన్నకోడూరు మండలం అన్నపూర్ణ రిజర్వాయర్ (అల్లీపూర్) వద్ద నుంచి రంగనాయకసాగర్ వరకు రైతుల పాదయాత్ర కొనసాగనుంది. 16 కిలోమీటర్ల మహాపాదయాత్రలో వేలాది మంది రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు పాల్గొన్నారు. మధ్యామ్నం ఈ పాదయాత్రలో రైతులతో కలిసి హరీశ్‌రావు పాల్గొననున్నారు.
సాగునీటి కోసం కదంతొక్కిన సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల రైతులు.
అన్నపూర్ణ సాగర్ నుండి రంగనాయక సాగర్ వరకు పాదయాత్ర.
కాళేశ్వరం ప్రాజెక్టు నుండి నీటిని లిఫ్ట్ చేసి అన్నపూర్ణ సాగర్, రంగనాయక సాగర్ ప్రాజెక్టులలో నీళ్ళు నింపి రైతులకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సాగుతున్న… pic.twitter.com/Irg1Zmdm0q
— Office of Harish Rao (@HarishRaoOffice) July 19, 2026