ప్రతీ గ్రామం ఆదర్శమే
సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న పల్లె ప్రగతి ద్వారా రాష్ట్రంలోని ప్రతి గ్రామం ఓ ఆదర్శ గ్రామంగా మారిందని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టంచేశారు. ఇటీవల జాతీయ అ వార్డులు పొందిన తెలంగాణ గ్రామాలు, మం డల, జిల్లా పరిషత్తుల ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఈ నెల 17న ఢిల్లీలో జరిగే కార్యక్రమానికి వెళ్తున్న సందర్భంగా వారికి హైదరాబాద్‌లోని మంత్రుల నివాసంలో అల్పాహార విందు ఇచ్చారు.
- మన దరిదాపుల్లో ఏ రాష్ట్రమూ లేదు
- గుజరాత్ సహా అనేక రాష్ట్రాలకు అవార్డులు రాలేదు: మంత్రి ఎర్రబెల్లి
హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న పల్లె ప్రగతి ద్వారా రాష్ట్రంలోని ప్రతి గ్రామం ఓ ఆదర్శ గ్రామంగా మారిందని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టంచేశారు. ఇటీవల జాతీయ అ వార్డులు పొందిన తెలంగాణ గ్రామాలు, మం డల, జిల్లా పరిషత్తుల ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఈ నెల 17న ఢిల్లీలో జరిగే కార్యక్రమానికి వెళ్తున్న సందర్భంగా వారికి హైదరాబాద్‌లోని మంత్రుల నివాసంలో అల్పాహార విందు ఇచ్చారు. ప్రజాప్రతినిధులు, అధికారుల బస్సుకు రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌తో కలిసి మంత్రి ఎర్రబెల్లి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఒకప్పుడు వరంగల్ జిల్లా గంగదేవిపల్లెను చూసి గర్వపడే వాళ్లమని, అందరూ అకడికివెళ్లి చూసే వాళ్లమని గుర్తుచేశారు. ఇప్పుడు తెలంగాణలోని ప్రతి పల్లె ఒక గంగదేవిపల్లిగా మారిందని చెప్పారు. సీఎం కేసీఆర్ ముందు చూపు వల్ల ఇవాళ గ్రామాల రూపు రేఖలు మారిపోయాయని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి రాష్ర్టానికి 79 అవార్డులు వచ్చాయని వెల్లడించారు. గుజరాత్, ఆంధ్రప్రదేశ్ సహా అనేక రాష్ట్రాలు మన దరిదాపుల్లో కూడా లేవని స్పష్టంచేశారు.
చైల్డ్ ఫ్రెండ్లీ గ్రామాలుగా మార్చాలి: బోయినపల్లి వినోద్‌కుమార్
ఇకపై గ్రామాలను చైల్డ్ ఫ్రెండ్లీ గ్రామాలు గా తీర్చిదిద్దాలని అధికారులకు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ సూచించారు. గ్రామాల్లో పార్కులు, క్రీడాప్రాంగణాలు, ఇండోర్గేమ్లు ఏర్పాటు చేయడం ద్వారా పిల్లలు సెల్‌ఫోన్ వ్యాపకం నుంచి బయటపడతారని చెప్పారు. కేంద్రం జాతీయ అవార్డుల ప్రమాణాలను మించిన ప్రతిభను మన గ్రామాలు సాధించాయని అన్నారు. కార్యక్రమంలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, పీఆర్, ఆర్డీ డైరెక్టర్ హనుమంతరావు, ప్రత్యేక కమిషనర్లు ప్రసాద్, ప్రదీప్‌కుమార్‌శెట్టి, అవార్డులు పొందిన గ్రామాల సర్పంచులు, కార్యదర్శులు, డీపీవోలు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

