సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పారిశ్రామికవాడలోని రూప కెమికల్స్ ఫ్యాక్టరీలో ఆదివారం సాయంత్రం అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నది. మూతపడి ఉన్న పరిశ్రమ నుంచి మంటలు భారీగా ఎగసిపడటంతో స్థానికుల సమాచారం మేరకు మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
ఫ్యాక్టరీని కొన్ని రోజుల క్రితమే లాకౌట్ చేసినట్టు తెలిసింది. ఫ్యాక్టరీలో కార్మికులు లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది.