గట్టు : గ్రామ సింహాలు(శునకాలు) పరుగో పరుగంటూ లంఘించాయి. జోగుళాంబ గద్వాల జిల్లా గట్టులోని అంబా భవాని జాతర ఉత్సవాల సందర్భంగా మంగళవారం టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో శునకాలకు పరుగు పందెం పోటీలను నిర్వహించారు.
ఈ పోటీలను ఏఎస్ఐ రాంచందర్‌జీ ప్రారంభించగా.. ఆసక్తిగా కొనసాగిన పోటీలను తిలకించడానికి ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. పోటీల్లో పదిహేను శునకాలు పాల్గొన్నాయి. ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ విజేతలుగా వరుసగా ఇందువాసి ఇన్సెట్బాయ్, రాజలబండ దేవ, రాయిచూర్ రాణి, బలిగేర మీసాల వెంకటేశ్‌కు చెందిన శునకాలు నిలిచాయి. విజేతలకు వరుసగా రూ.8 వేలు, రూ.6 వేలు, రూ.4 వేలు, రూ.2 వేలను నగదు బహుమతులుగా 17న ప్రదానం చేయనున్నారు.