
అబద్ధం
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు సంబంధించి ఇప్పటికే 1,09,027 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. నిధుల కొరత, దరఖాస్తుల పరిశీలనలో జాప్యం కారణంగా పెండ్లి జరిగి ఏడాది గడిచినా చాలామంది లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ కావడంలేదు. కొందరు జంటలకు పిల్లలు పుట్టిన తర్వాత కూడా కల్యాణలక్ష్మి అందని పరిస్థితి నెలకొన్నది. కల్యాణలక్ష్మి పథకానికి రూ.462.50 కోట్లు విడుదల చేస్తూ ఆర్థికశాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తులకు రూ.1,000 కోట్లుకు పైనే నిధుల అవసరం ఉండగా, అందులో సగం కూడా విడుదల చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
(నవంబర్ 26న ఆంధ్రజ్యోతి కథనం)
వాస్తవం
పిల్లలు పుట్టినా కల్యాణలక్ష్మి రావట్లే.. అనే శీర్షికతో నవంబర్ 26న ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన కథనంలో పేర్కొన్న విధంగా దరఖాస్తులు పెండింగ్లో లేవు. నిధులు సైతం ఎప్పటికప్పుడు విడుదలవుతున్నాయి. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.2,750.46 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. అందులో ఇప్పటికే 1,550.34 కోట్లను విడుదల చేసింది. ఇటీవలనే రూ.687.61 కోట్లను విడుదల చేసింది. అయితే, కేవలం రూ.462 కోట్ల నిధులను మాత్రమే విడుదల చేసినట్టు ఆంధ్రజ్యోతి ప్రచురించింది. అసంపూర్తి సమాచారంతో కథనాలను ప్రచురించవద్దు.
-బీసీ సంక్షేమశాఖ